నిన్ను విడిపించుటకై… దేవుడు నీతోనే ఉన్నాడు!
Telugu Section
నిన్ను విడిపించుటకై… దేవుడు
నీతోనే ఉన్నాడు!
“నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైయుందును” — యిర్మియా 15:20
ఇది దేవుడు యిర్మియాకు ఇచ్చిన ధైర్యమును కల్గించే గొప్ప వాగ్దానం, యుద్ధం చేసినా – దేవుడు తోడుగా ఉంటే ఏ శక్తి కూడా మనల్ని జయించలేదు అనే సందేశం ఇందులో ఉంది.
యిర్మియా ప్రవక్తను చెరలో వేశారు,
బావిలో పడవేశారు,
కొట్టారు…
ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా,
ఎన్ని సమస్యలు ఎదురైనా,
దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు.
అందుకే ఆ పరిస్థితుల అన్నిటి నుండి దేవుడు అతనిని విడిపించి, చివరికి విజయాన్ని ఇచ్చాడు.
యిర్మియా 15:20వ వచనములో మనకు కనపడుతున్న ఈ వాగ్దానం,
నిన్ను రక్షించుటకును…
నిన్ను విడిపించుటకును…
నేను నీకు తోడైయుందును!
ఇది మాట కాదు ఇది దేవుడు ఇచ్చిన వాగ్దానం
ఇది మారదు… ఇది విఫలంకాదు! అనాడు యిర్మియాలో ఈ వాగ్దానమును నెరవేర్చిన దేవుడు ఈనాడు మన జీవితాలలో కూడా ఈ వాక్యమును నెరవేర్చ సమర్థతను కలిగిన వాడు ఎందుకంటే వాక్యమై ఉన్న దేవుడు నిన్న నేడు నిరంతరము ఏక రీతిగా ఉన్నాడు కాబట్టి,
మీమ్మల్లి ఎవరైనా ఎదిరించవచ్చు…
పరిస్థితులు మీమ్మల్లి నొక్కివేయడానికి రావచ్చు…
మీ చుట్టూ చీకటి పెరిగిపోవచ్చు…
ప్రపంచం అంతా మీకు వ్యతిరేకంగా నిలిచినా…
మీ చుట్టూ పరిస్థితులు కూలిపోతున్నట్టు అనిపించినా…
గుర్తుపెట్టుకోండి మీరు ఒంటరిగా లేరు.
మీ వెనుక కాదు… మీ పక్కన కూడ కాదు…
మీతో కలిసి నడిచే దేవుడు మీతోనే ఉన్నాడు!
మీమ్మల్లి కూల్చాలని ప్రయత్నించే ప్రతి శక్తికి
ఇది ఒక హెచ్చరిక
ఈ మనిషిని తాకొద్దు… దేవుడు ఇతనితో ఉన్నాడు! ఆని
మాటల ద్వార, భయం కలిగించే పరిస్థితుల ద్వార ఎటువంటి శక్తులు అయిన మీతో యుద్ధం చేయవచ్చు… దాడి చేయవచ్చు…
మిమ్మల్ని భయపెట్టవచ్చు…
కానీ
దేవుడు మీకు తోడుగా ఉన్నప్పుడు
ఏ శక్తి మిమ్మల్లి జయించలేదు!విజయాన్ని పొందలేదు,
ఎందుకంటే —
మీ కోసం నిలబడిన దేవుడు, మిమ్ములను ఏర్పరచుకున్న దేవుడు మిమ్ములను పిలిచిన దేవుడు
ఈ లోకాన్ని మరణాన్ని సాతానుని జయించిన దేవుడు!
ఆనాడు యిర్మియాను రక్షించిన కాపాడిన విడిపించిన ఆ దేవుని రక్షణ మిమ్మల్ని కాపాడుతుంది…
ఆయన విమోచన మిమ్మల్ని బయటకు తీసుకొస్తుంది…
మీ కథ ఇంకా ముగియలేదు ఎందుకంటే
దేవుడు మీ కోసం ఇంకా పనిచేస్తున్నాడు కాబట్టి
మీరు ఏటువంటి పరిస్థితులలో ఉన్నప్పటికీ మీ ఓటమి మీ అపజయం రద్దు చేయబడను గాక!
మీ బంధకం తెగిపోవును గాక!
మీ విమోచన దగ్గరలోనే అతి సమీపంలోనే ఉండును గాక! ఆమేన్
యిర్మియా ప్రవక్తను రక్షించిన విడిపించిన దేవుడు
మిమ్మల్ని రక్షించటానికి … మీమ్మల్లి విడిపించటానికి…
మీకు తోడుగా ఉన్నాడు అన్న వాక్యము ఇదే సత్యం! మీరు భయపడకుండా విశ్వసిస్తున్న వారు అయితే ఈ ప్రార్థనతో ఏకీభవించండి.
ప్రార్థన 🙏
ప్రియమైన మా పరలోకపు తండ్రీ,
మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానమునకు స్తోత్రములు దేవా.
నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైయుందును” అని యిర్మియా ప్రవక్త కు వాగ్దానం ఇచ్చి నెరవేర్చిన దేవా!
ఈ వాక్యమును విశ్వసిస్తున్న
మా జీవితాలలో కూడా అదే విధముగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను.
యిర్మియాకు తోడుగా ఉన్నట్టు,
ప్రతి వ్యతిరేకతలో, ప్రతి కష్టంలో, ప్రతి యుద్ధంలో
మాకు తోడుగా నిలవండి.
మా మీదకు వచ్చిన ప్రతి దాడి నుండి మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని ఆనచి వేయడానికి వచ్చిన ప్రతి పరిస్థితి నుండి మమ్మల్ని విడిపించండి.
భయపడే హృదయాన్ని మాలో నుండి తొలగించి,
మిమ్ములను మీ వాక్యమును నమ్మే దృఢమైన విశ్వాసాన్ని మాలో నింపండి.
మా జీవితంలో మీ రక్షణను ఉంచండి,
మా జీవిత ప్రయాణమంతటిలో మీ సన్నిధిని అనుభవించునట్లు మీ కృప దయచేయండి,
మా మీద యుద్ధం చేసే శక్తులు ఉన్నా,
వాటిలోనుండి మమ్మల్ని బయటకు తీసుకొచ్చి
విజయాన్ని అనుభవించునట్లు మమ్ములను దీవించండి.
మా కథ ఇంకా ముగియలేదని మాకు గుర్తుచేసి,
మీరు మా కోసం పనిచేస్తున్నారనే విశ్వాసాన్ని మా అందరి హృదయాలలో వుంచి మమ్ములను
ముందుకు నడిపించమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి…ఆమెన్!
ఎస్తేర్ క్రైసో లైట్
7-4-2026
YouTube Channel: https://www.youtube.com/@chrysolyteministries?sub_confirmation=1
Facebook: https://www.facebook.com/share/1CP8iYHbTJ/
Website: chrysolyteministries.com
CHRYSOLYTE WOMEN'S GOSPEL MINISTRIES
ENGLISH SECTION
God Is With You… To Rescue and Deliver You!
God Is With You… To Rescue and Deliver You!
“I will save you and deliver you, for I am with you,” declares the Lord. — Jeremiah 15:20
This is a powerful and courage-giving promise that God gave to the prophet Jeremiah.
The message is clear: No matter how intense the battle is, if God is with us, no power can overcome us.
Jeremiah was:
Imprisoned
Thrown into a pit
Beaten
Yet, despite all opposition and suffering, God was with him.
No matter how many problems came,
No matter how strong the opposition was,
God stood by him.
And in the end, God delivered him from every situation and gave him victory.
---
A Promise That Still Stands Today
In Jeremiah 15:20, we see this promise clearly:
To save you…
To deliver you…
I am with you…
This is not just a statement —
This is a promise from God.
It does not change.
It does not fail.
The same God who fulfilled this promise in Jeremiah’s life is able to fulfill it in our lives today.
Because God, who is the Word, is the same yesterday, today, and forever.
---
No Matter What You Are Facing…
People may rise against you…
Situations may try to crush you…
Darkness may increase around you…
Even if the whole world stands against you…
Even if everything around you feels like it is collapsing…
Remember this: You are not alone.
God is not just behind you…
Not just beside you…
He is with you. Walking with you.
---
A Warning to Every Force Against You
Every power that tries to pull you down should hear this:
“Do not touch this person… God is with them!”
Through words…
Through fear…
Through situations…
Many forces may try to fight you, attack you, and intimidate you.
But when God is with you,
No power can defeat you.
Because—
The God who stands for you,
The God who chose you,
The God who called you,
Is the One who has already overcome the world, death, and Satan.
---
Your Story Is Not Over
The same God who protected and delivered Jeremiah
Will protect you and bring you out.
His protection will guard you.
His deliverance will bring you out.
Your story is not over—
Because God is still working for you.
No matter what situation you are in:
Your defeat is canceled!
Your failure is canceled!
Your bondage will be broken!
Your deliverance is near — very near!
Amen.
---
Prayer 🙏
Heavenly Father,
Thank You for this powerful promise You have given us.
You are the God who promised Jeremiah,
“I will save you and deliver you, for I am with you,”
and You fulfilled it.
We pray that You will fulfill this same promise in our lives.
Just as You were with Jeremiah,
Be with us in every opposition, every struggle, and every battle.
Protect us from every attack that rises against us.
Deliver us from every situation that tries to press us down.
Remove fear from our hearts,
And fill us with strong faith to trust in You and Your Word.
Let Your protection rest upon our lives,
And help us to experience Your presence throughout our journey.
Even if forces rise against us,
Bring us out of them and grant us victory.
Remind us that our story is not over,
And fill our hearts with faith that You are still working for us.
We offer this prayer in the name of Jesus,
Amen.
Esther Chrysolyte
4-4-2026
YouTube Channel: https://www.youtube.com/@chrysolyteministries?sub_confirmation=1
Facebook: https://www.facebook.com/share/1CP8iYHbTJ/
Website: chrysolyteministries.com
CHRYSOLYTE WOMEN'S GOSPEL MINISTRIES
Comments
Post a Comment