సత్యం ఎప్పుడూ ఒంటరిగా ఉండదు.
TELUGU SECTION
సత్యం ఎప్పుడూ ఒంటరిగా ఉండదు.
దేవుడు న్యాయముగల దేవుడు. అందుకే ఆయన ఒక సూత్రాన్ని ఏర్పరచాడు, ఏ విషయం అయినా ఒకరి మాటతో కాదు, ఇద్దరు లేదా ముగ్గురు సాక్షుల ద్వారా స్థిరపడాలి అని దేవుడు ఇచ్చిన ఈ ఆజ్ఞ ద్వితియోపదేశకాండము 19:15 వ వచనములలో మనకు కనపడుతుంది.
"ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చియే గాని యే పాపమునుగూర్చియే గాని ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు. ఇద్దరు సాక్షుల మాటమీదనైనను ముగ్గురు సాక్షుల మాటమీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడును."
మనము చేసే ప్రతి పని, మనం చెప్పే ప్రతి మాటకు సాక్ష్యంగా నిలబడాలని దేవుడు భూమి, ఆకాశానికి ఆజ్ఞాపించాడు. ఎందుకంటే మానవులు సాక్ష్యాలను తారుమారు చేయవచ్చు, అంటే వారు సాక్ష్యాన్ని తప్పుగా ఉపయోగించవచ్చు, న్యాయాన్ని అడ్డుకోవచ్చు. అందుకే దేవుడు భూమి, ఆకాశాన్ని తనకు సాక్షులుగా ఉంచాడు.
ఇది మానవులలో ప్రారంభమైన ఆలోచన కాదు…
ఇది దేవుని హృదయం నుండి వచ్చిన న్యాయ విధానం. అబద్ధం, అన్యాయం, తొందరపాటు తీర్పు, జరగకుండా ఉండటానికి దేవుడు ఈ సాక్ష్య విధానాన్ని ఏర్పాటు చేశాడు.
ఈ సాక్ష్యం వల్ల ప్రయోజనం ఏమిటి అంటే?
అబద్ధం నిలబడదు, సత్యం స్థిరపడుతుంది,
తీర్పు న్యాయంగా ఉంటుంది, దేవుని మార్గం స్పష్టంగా తెలుస్తుంది,
అందుకే పరిశుద్ధ గ్రంథంలో,
ఒక సత్యం నిలబడాలంటే — దానికి సాక్ష్యం ఉంటుంది.
సిలువ దగ్గర కూడా ఇదే సూత్రం మనకు కనిపిస్తుంది:
పాప శాపము వలన మరణించే అనుభవాన్ని పొందిన మానవున్ని విడిపించడానికి మరణం మీద విజయాన్ని ఇవ్వటానికి సిలువ మీదకు ఎక్కిన క్రీస్తు ప్రభువు వారు చేస్తున్న ప్రయత్నానికి ఇక్కడ భూమి ఆకాశం కూడా సాక్ష్యంగా నిలబడ్డది,
ఆకాశం చీకటి అయింది… భూమి కంపించింది…
సృష్టి కూడా సాక్షులుగా నిలబడి, ఆ సంఘటన యొక్క సత్యాన్ని ప్రకటించింది,
దీనివలన దేవుడు మనకు నేర్పేది ఏమిటంటే,
సత్యం ఎప్పుడూ ఒంటరిగా ఉండదు… దానికి సాక్ష్యం ఉంటుంది అని,
మానవునికి సాక్షిగా ఉంచిన ఈ భూమి, ఆకాశం క్రీస్తు ప్రభువుకు ఎందుకు సాక్ష్యంగా నిలిచింది అంటే,
పాప శాప బంధకాళ్లలో బంధించబడి ఉన్న మానవుని రక్షించడానికి, ఆ పాప శాపలను తన మీద వేసుకుని సిలువలో బాధలను అనుభవిస్తూ, మనుష్య కుమారునిగా సత్యం, న్యాయం కోసం తన జీవితం పాణార్పణం గా పోయబడేటప్పుడు, భూమి, ఆకాశం ఆయనకూ సాక్ష్యంగా నిలిచింది.ఎందుకంటే జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును వీటికి సాక్షిగా నిలబెట్టుటకు భూమ్యాకాశములను పిలిచింది దేవుడే కాబట్టి,
దీనిని మనము ద్వితియోపదేశకాండము 30:19 వ వచనములో చూడవచ్చు, "నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ యెదుటను ఉంచి, భూమ్యాకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను."
చూశారా కొన్ని సంవత్సరాల క్రితం పాత నిబంధనలో జీవమును ఆశీర్వాదమును మరణమును శాపమును వీటి గురించి సాక్షులుగా భూమిని ఆకాశమును దేవుడు ఉంచినప్పుడు, మానవుని మరణానికి కారణమైన శాపాన్ని తీసివేయడానికి, మానవుడు కోల్పోయిన దేవునితో సహవాసము అనే జీవాన్ని తిరిగి మానవునికి ఇవ్వటానికి,
సాతాను ఆధీనంలో ఉన్న మరణము యొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపు చెవులను చెరను చెరగా పట్టుకొనిపోయి మనష్యులకు ఈవులను అనుగ్రహించటానికి,
ఆత్మసంబంధమైన ఆశీర్వాదాలతో మానవున్ని ఆశీర్వదించటానికి, క్రీస్తు ప్రభువు సిలువలో చేస్తున్న యాగానికి, దీనికి సాక్షిగా ఇక్కడ ఆకాశం చీకటిని కనపరిచింది, భూమి కంపించింది,
దేవుని ద్వారా నిర్మించబడిన ఈ సృష్టి దేవుని ఆజ్ఞను పాటిస్తుంది, దేవుడు ఏ పని అయితే తనకు అప్పగించాడో ఆ పనిని నమ్మకంగా ఈ సృష్టి జరిగిస్తుంది అని అనటానికి ఈ సంఘటననే ఒక సజీవమైన సాక్ష్యం,
మన జీవితంలో మనం చేసే పనులు, మన విశ్వాసం, మన హృదయములో వచ్చే ఆలోచనలు, మనము చేసే ప్రతి చిన్న ప్రయత్నం, ప్రతి నిస్వార్థమైన త్యాగం, మనకు జరిగే అన్యాయాలు ఇవన్నీ కూడ భూమి, ఆకాశం దగ్గర సాక్ష్యంగా నిలుస్తాయి, మన గురించి చెబుతాయి అన్న ఈ సత్యాన్ని మీరు గ్రహించగలరా.
ఎస్తేర్ క్రైసోలైట్
4-4-2026
YouTube Channel: https://www.youtube.com/@chrysolyteministries?sub_confirmation=1
Facebook: https://www.facebook.com/share/1CP8iYHbTJ/
Website: chrysolyteministries.com
CHRYSOLYTE WOMEN'S GOSPEL MINISTRIES
ENGLISH SECTION
Truth Is Never Alone
God is a righteous God. That is why He established a principle: no matter what the matter is, it should not be confirmed by the testimony of one person alone, but by two or three witnesses. This command given by God is seen in Deuteronomy 19:15:
"One witness shall not rise against a man concerning any iniquity or any sin that he commits; by the mouth of two or three witnesses the matter shall be established."
God has commanded the heavens and the earth to stand as witnesses for every action we do and every word we speak. Because humans can manipulate or misuse testimony, they may distort truth and hinder justice. That is why God appointed the heavens and the earth as His witnesses.
This idea did not originate from humans…
It is a system of justice that came from the heart of God. To prevent lies, injustice, and hasty judgment, God established this principle of witnesses.
What is the benefit of this testimony?
Lies will not stand, but truth will be established.
Judgment will be righteous, and God’s way will be made clear.
That is why the Holy Scriptures reveal that
for any truth to stand — there will always be a witness.
We can see the same principle even at the cross:
When Jesus Christ went to the cross to deliver mankind from the curse of sin and to grant victory over death, the heavens and the earth stood as witnesses to His sacrifice.
The sky became dark… the earth shook…
Creation itself stood as a witness, declaring the truth of that event.
Through this, God teaches us that
truth is never alone… it always has a witness.
Why did the heavens and the earth stand as witnesses for Christ?
Because when He took upon Himself the curse of sin that bound humanity, and as He suffered on the cross, offering His life as a sacrifice for truth and righteousness, the heavens and the earth testified on His behalf.
For it is God who called the heavens and the earth as witnesses concerning life and death, blessing and curse.
We see this in Deuteronomy 30:19:
"I call heaven and earth as witnesses today against you, that I have set before you life and death, blessing and cursing."
Do you see?
Years before, in the Old Testament, when God appointed the heavens and the earth as witnesses concerning life, blessing, death, and curse — at the cross, to remove the curse that brought death to mankind, and to restore the life of fellowship with God that humanity had lost,
Christ took the keys of death and Hades, which were under the control of Satan, and gained victory, in order to grant life and spiritual blessings to mankind.
For this great sacrifice on the cross,
the sky showed darkness, and the earth trembled as witnesses.
This event stands as a living testimony that creation, which was formed by God, obeys His command faithfully and fulfills the purpose He has given it.
In our lives, everything we do — our faith, the thoughts in our hearts, every small effort, every selfless sacrifice, and even the injustices we face — all these stand as witnesses before the heavens and the earth and speak about us.
Can you understand this truth?
Esther Chrysolyte
4-4-2026
YouTube Channel: https://www.youtube.com/@chrysolyteministries?sub_confirmation=1
Facebook: https://www.facebook.com/share/1CP8iYHbTJ/
Website: chrysolyteministries.com
CHRYSOLYTE WOMEN'S GOSPEL MINISTRIES
Comments
Post a Comment