Posts

నిన్ను విడిపించుటకై… దేవుడు నీతోనే ఉన్నాడు!

Telugu Section  నిన్ను విడిపించుటకై… దేవుడు  నీతోనే ఉన్నాడు!  “నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైయుందును” — యిర్మియా 15:20 ఇది దేవుడు యిర్మియాకు ఇచ్చిన  ధైర్యమును కల్గించే గొప్ప వాగ్దానం,  యుద్ధం చేసినా – దేవుడు తోడుగా ఉంటే ఏ శక్తి కూడా మనల్ని జయించలేదు అనే సందేశం ఇందులో ఉంది. యిర్మియా ప్రవక్తను చెరలో వేశారు, బావిలో పడవేశారు, కొట్టారు… ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఎన్ని సమస్యలు ఎదురైనా, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అందుకే  ఆ  పరిస్థితుల అన్నిటి నుండి దేవుడు అతనిని విడిపించి, చివరికి విజయాన్ని ఇచ్చాడు.  యిర్మియా 15:20వ వచనములో మనకు కనపడుతున్న ఈ వాగ్దానం,  నిన్ను రక్షించుటకును… నిన్ను విడిపించుటకును… నేను నీకు తోడైయుందును! ఇది మాట కాదు ఇది దేవుడు ఇచ్చిన వాగ్దానం  ఇది మారదు… ఇది విఫలంకాదు! అనాడు యిర్మియాలో ఈ వాగ్దానమును నెరవేర్చిన దేవుడు ఈనాడు మన జీవితాలలో కూడా ఈ వాక్యమును నెరవేర్చ సమర్థతను కలిగిన వాడు ఎందుకంటే వాక్యమై ఉన్న దేవుడు నిన్న నేడు నిరంతరము ఏక రీతిగా ఉన్నాడు కాబట్టి, మీమ్మల్లి ఎవరైనా ఎదిరించవచ్చు… పరిస్థితులు...

సత్యం ఎప్పుడూ ఒంటరిగా ఉండదు.

TELUGU SECTION సత్యం ఎప్పుడూ ఒంటరిగా ఉండదు. దేవుడు న్యాయముగల దేవుడు. అందుకే ఆయన ఒక సూత్రాన్ని ఏర్పరచాడు, ఏ విషయం అయినా ఒకరి మాటతో కాదు, ఇద్దరు లేదా ముగ్గురు సాక్షుల ద్వారా స్థిరపడాలి అని దేవుడు ఇచ్చిన ఈ ఆజ్ఞ ద్వితియోపదేశకాండము 19:15 వ వచనములలో మనకు కనపడుతుంది. "ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చియే గాని యే పాపమునుగూర్చియే గాని ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు. ఇద్దరు సాక్షుల మాటమీదనైనను ముగ్గురు సాక్షుల మాటమీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడును." మనము చేసే ప్రతి పని, మనం చెప్పే ప్రతి మాటకు సాక్ష్యంగా నిలబడాలని దేవుడు భూమి, ఆకాశానికి ఆజ్ఞాపించాడు. ఎందుకంటే మానవులు సాక్ష్యాలను తారుమారు చేయవచ్చు, అంటే వారు సాక్ష్యాన్ని తప్పుగా ఉపయోగించవచ్చు, న్యాయాన్ని అడ్డుకోవచ్చు. అందుకే దేవుడు భూమి, ఆకాశాన్ని తనకు సాక్షులుగా ఉంచాడు. ఇది మానవులలో ప్రారంభమైన ఆలోచన కాదు… ఇది దేవుని హృదయం నుండి వచ్చిన న్యాయ విధానం. అబద్ధం, అన్యాయం, తొందరపాటు తీర్పు, జరగకుండా ఉండటానికి దేవుడు ఈ సాక్ష్య విధానాన్ని ఏర్పాటు చేశాడు. ఈ సాక్ష్యం వల్ల ప్రయోజనం ఏమిటి అంటే? అబద్ధం నిలబడదు, సత్యం స్థిరపడుతుంది...